ముంబయి: భారత విమానయాన సంస్థ ఎయిరిండియాకు చెందిన అధికారిక ట్విటర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైనట్లు ఆ సంస్థ అధికారి ఒకరు వెల్లడించారు. ఈరోజు ఉదయం కొన్ని గంటల పాటు ఖాతా హ్యాక్ అయ్యిందని, తర్వాత దాన్ని తిరిగి పునరుద్ధరించామని తెలిపారు. అధికార ట్విటర్ ఖాతా @airindiain లో టర్కిష్ భాషలో సందేశం పోస్ట్ చేశారని సంస్థ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు పోస్ట్ చేసిన సందేశాలను తొలగించామని, ఖాతా తిరిగి తమ ఆధీనంలోకి వచ్చిందని తెలిపారు. హ్యాకర్స్ పోస్ట్ చేసిన ఓ పోస్ట్‌లో ‘చివరి నిమిషపు ముఖ్యమైన ప్రకటన.. మా అన్ని విమానాలు రద్దయ్యాయి. ఇక నుంచి మేము టర్కిష్ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణాలు కొనసాగిస్తాం’ అని రాశారు. ఎయిరిండియా ట్విటర్ ఖాతాను దాదాపు 1,46,000 మంది ఫాలో అవుతున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa