హైదరాబాద్: ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ మేడిపండులా ఉందని బీజేపీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. అసెంబ్లిలో ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన స్పందించారు. బడ్జెట్ బారెడు… కేటాయింపులు జానెడుగా ఉందన్నారు. పథకాలు పూర్తి కావాలంటే మరో 3 లక్షల కోట్లు కావాలన్నారు. బడ్జెట్‌లో చెప్పిన లెక్కల ప్రకారం 85 వేల ఖాళీలు ఉన్నాయని, ఇలాగే పాలన చేస్తే ఖాళీల భర్తీకి 14 ఏళ్లు పడుతుందన్నారు. రైతుల రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa