ఆహారభద్రత, అంత్యోదయ కార్డుల కోసం మీసేవ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని పౌరసరఫరాలశాఖ శుక్రవారం సర్క్యులర్ జారీచేసింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారితో పాటు కొత్తగా ఇచ్చేవారి దరఖాస్తులు కూడా స్వీకరించి తదుపరి ప్రక్రియను కొనసాగించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అన్నిజిల్లాల జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. పౌరసరఫరాలశాఖ ప్రక్షాళనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో అతి ముఖ్యమైంది ఈ-పాస్ విధానం. రాష్ట్రవ్యాప్తంగా ఈ-పాస్ సజావుగా అమలవుతుండటంతో ఎక్కడ, ఎంత బియ్యం వినియోగదారులకు చేరుతుందనే వివరాలు పక్కాగా తెలుస్తున్నాయి. ఈ విధానం అమల్లోకి వచ్చాక బియ్యం పెద్దమొత్తంలో ఆదా అవుతున్నది. ప్రతినెలా 12 నుంచి 15 శాతం వరకు బియ్యం మిగులుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. అక్రమాలకు దాదాపుగా తెరపడటంతో కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తులకు ఇక మార్గం సుగమమైంది. ఆకలితో ఏ ఒక్కరు ఉండరాదన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం 85 లక్షలమందికి కార్డులు జారీచేయగా, వీటిద్వారా నెలకు 2.75 కోట్లమంది ప్రయోజనం పొందుతున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa