హైదరాబాద్ : జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం. దానకిశోర్ అధ్యక్షతన శనివారం ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 5 నుంచి ఆరు గంటల వరకు మీట్ యువర్ ఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శుక్రవారం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 6 నుంచి 6 :30 గంటల వరకు డయల్ యువర్ ఎండీ కార్యక్రమంలో ఎండీ దానకిశోర్ పాల్గొని వినియోగదారుల ఫిర్యాదులను స్వీకరించనున్నారని తెలిపారు. 040-23442881, 23442882, 23442883 నెంబర్లకు ఫోన్ చేసి విధిగా క్యాన్ నెంబర్ చెప్పడంతో పాటు సమస్యను తెలియజేస్తే వాటికి పరిష్కారం చూపునున్నారని పేర్కొన్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు రెవెన్యూ అదాలత్ నిర్వహించి, అపరిష్కృతంగా ఉన్న బిల్లింగ్, రెవెన్యూ, మీటర్ సమస్యలను పరిష్కరించనున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa