ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో ఎక్కువ మంది ఇష్టపడే టిఫిన్ ఇదేనట..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 19, 2018, 12:23 PM

ప్రతిరోజూ తీసుకునే అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్)లో ఇడ్లీకే నగర వాసులు ఓటు అంటున్నారు. ఆరోగ్యం పట్ల పెరిగిన అవేర్‌నెస్‌ కూడా దీనికి కారణమని చెబుతున్నారు. అయితే ఉదయమే హెవీగా కాకుండా కాస్త లైట్‌ఫుడ్‌ తీసుకోవడానికి మెజారిటీ ప్రజలు ఇష్టపడుతున్నారు. వడ, దోశ, ఉప్మా, పూరీ వంటి ఆయిల్‌ ఎక్కువగా ఉండే ఫుడ్‌కు అధికశాతం దూరంగా ఉంటున్నట్టు స్పష్టం చేశా రు. ఇడ్లీ కాకుండా పైన పేర్కొన్న ఆహారాన్ని కూడా తీసుకుంటున్నా అధిక శాతం మంది తక్కువ మోతాదులోనే వీటిని బ్రేక్‌ ఫాస్ట్‌గా తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇక ఆదివారం వచ్చిందంటే మాత్రం నోటికి తాళం వేసుకోకుండా ఇష్టమైనఫుడ్‌ తీసుకునేందుకే సిటీ జనులు ఆసక్తి చూపిస్తున్నట్టు కూడా స్పష్టం చేశారు. ఇక్కడ కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొవ్వు (కొలెస్ట్రాల్‌) తక్కువగా ఉండే చికెన్‌కే పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు.


 చికెన్‌ తర్వాత స్థానం మటన్‌కే ఇచ్చారు. దాని తర్వాత చేపలు, ఇతర మాంసాహారం (మేకలోని ఇతర శరీరభా లు)పై ఆసక్తి చూపిస్తున్నట్టు చెప్పారు. నగర వాసులు బ్రేక్‌ఫాస్ట్‌లో దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు? ఆదివారం సెలవు రోజులో దేనిని ఎక్కువ ఇష్టపడుతున్నారు? సండే స్పెషల్‌గా దేనిని కోరుకుంటున్నారు? అన్న అంశంపై ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తి కరమైన అంశాలు వెల్లడయ్యాయి.


 నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌, మెహిదీపట్నం, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్‌ తదితర ప్రాంతాల్లోని 1200 మందిని ఈ సర్వేలో భాగస్వాములను చేయగా అధికశాతం మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లో ఇడ్లీ తినడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇక సాధారణ రోజుల్లో బ్రేక్‌ఫాస్ట్ లోని ఐటమ్స్‌ ఇలా ఉండగా ఆదివారం బ్రేక్‌ఫాస్ట్ లో మాత్రం ఏ విధమైన మొహమాటం లేకుండా ఇష్టమైన ఫుడ్‌ను ప్రత్యేకించి నాన్‌వెజ్‌కే అధిక శాతం మంది ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.


 సర్వేలో పాల్గొన్న మొత్తం 1200 మం దిలో 475 మంది బ్రేక్‌ఫాస్ట్ లో ఇడ్లీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. ఆ తర్వాత దోశను తీసుకుంటున్నట్టు 193 మంది చెప్పగా చపాతిని తింటున్నట్టు 160 మంది వెల్లడించారు. అలాగే వడను తీసుకుంటున్నట్టు 126 మంది తెలిపారు. ఇక పూరీని బ్రేక్‌ఫాస్ట్ లో తీసుకుంటున్నట్టు మరో 80 మంది వెల్లడించారు. రైస్‌ ఐటమ్స్‌ ఇష్టమని 110 మంది చెప్పగా, ఉప్మాకు కే వలం 56 మంది అనుకూలంగా స్పందించారు


బ్రేక్‌ఫాస్ట్ లో ఇడ్లీ తీసుకోవడానికి మెజార్టీ ప్రజలు ఇష్టపడుతున్నట్టు సర్వేలో స్పష్ట మైంది. దీనికి ప్రధాన కారణం ఇడ్లీలో మంచి పోషకాలు ఉండడం వల్ల ఆరోగ్యానికి మంచి దని చెప్పారు. డాక్టర్లు సైతం ఇడ్లీని సూచిస్తున్నట్టు చెప్పారు. ఆయిల్‌ లేకుండా కేవలం ఆవిరిపైనే వీటిని తయారు చేయడం, తేలికగా జీర్ణం కావడం, ధర కూడా తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల అధికశాతం మంది ఇడ్లీని తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇంట్లోనే ఇడ్లీ తయారు చేసుకోవడం చాలా సులభం కావడంతో పాటు సమయం కలిసి వస్తుంది. అందుకే ఎక్కువ మంది ఇడ్లీపై ఆసక్తి చూపిస్తున్నటు  చెప్పారు. ఇడ్లీతో పాటు కొందరు వడ, దోశను ప్రిఫర్‌ చేస్తున్నారు. వీటికి కాంబినేషన్‌గా చట్నీ, సాంబారు వంటివి తీసుకుంటున్నట్టు తెలిపారు.


 ఇడ్లీని మధ్యాహ్న భోజనంగా కూడా తినేందుకు అనుకూలంగా ఉంటుందని చాలా మంది ఉద్యోగులు, విద్యార్థులు లంచ్‌ బాక్స్‌లలో తీసుకెళ్లడానికి ఇష్టపడుతున్నారు. ఇక మిగిలిన ఐటమ్స్‌లో చపాతిని తీసుకోవడం ఇష్టమని చాలా మంది వెల్లడించారు. కాస్తడైట్‌ను పాటిస్తున్నవారే దీనికి ఓటేస్తున్నట్టు చెప్పారు. దోశతో పాటు ఉప్మాను కలిపి తీసుకుంటున్నట్టు సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 15 శాతం మం ది వెల్లడించారు. ఇడ్లీతో పాటు, వడను కాంబినేషన్‌లో సాంబార్‌తో కలిపి తీసుకుంటు న్నట్టు మరో 15 శాతం మంది స్పష్టం చేశారు.


 పూరీతో వెజిటేబుల్‌ కుర్మా, లేదా ఆలూ కుర్మాను తీసుకుంటున్నట్టు 20 శాతం మంది తెలిపారు. కేవలం ఉప్మాను తీసుకుంటున్నట్టు అతి తక్కువగా 2 శాతం మందే చెప్పారు. ఇక రైస్‌ ఐటమ్స్‌గా పులిహోర, పెరుగన్నం, విజిటెబుల్‌ పొలావ్‌ వంటివి బ్రేక్‌ఫా్‌స్టలో ఇష్టమని 10 శాతం మంది చెప్పారు. ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించేవారే అధికశాతం లైట్‌ఫుడ్‌ను ఇష్టపడుతున్నామని, ఇందులో ఇడ్లీనే ఎక్కువ ప్రిఫర్‌ చేస్తున్నామని తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa