హైదరాబాద్: రాష్ట్ర మంత్రులు కడియం శ్రీహరి, ఈటెల రాజేందర్, హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి, లక్ష్మారెడ్డితో తెలంగాణ ఎంఆర్పీఎస్ నేతలు సమావేశమయ్యారు. 50 నుంచి 65 ఏండ్ల మధ్య ఉన్న డప్పు, చెప్పు చేతివృత్తుల వారందరికీ పెన్షన్ ఇవ్వాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఎంఆర్పీఎస్ నేతలు వంగపల్లి శ్రీను, సుంకపాక దేవయ్య, యాతాకుల భాస్కర్, మేడి పాపయ్య, రేగుంట సునీల్, ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ బుద్ధ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు ఎంఆర్పీఎస్ నేతలకు హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa