కుమ్రం భీం ఆసిఫాబాద్: సిర్పూర్ పేపర్ మిల్లు పునఃప్రారంభానికి లైన్ క్లియర్ అయింది. మిల్లు పునరుద్ధరణ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. మిల్లును పునఃప్రారంభిస్తున్న జేకే పేపర్ లిమిటెడ్ కంపెనీ రూ. 628 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఆ కంపెనీలో పని చేస్తున్న మొత్తం 1200 మంది వర్కర్లుతో పాటు కాంట్రాక్ట్ వర్కర్లను కూడా మళ్లీ పనిలోకి తీసుకోవడానికి ఓకే చెప్పింది. దీనిపై మార్చి 2న, 14న జరిగిన కేబినేట్ మీటింగ్‌లో మంత్రులు మిల్లు పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా జేకే కంపెనీకి పది సంవత్సరాల పాటు అన్ని రాయితీలు కల్పిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ జీవో 18ని విడుదల చేసింది. దీంతో పేపర్ మిల్లు పునఃప్రారంభానికి లైన్ క్లియరైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa