హైదరాబాద్: కల్లుగీత కార్మికులకు మూడేళ్లలో రూ.6.38 కోట్ల పరిహార బకాయిలు చెల్లించామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అసెంబ్లిలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…. ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం చెందిన కల్లుగీత కార్మికులకు పరిహారం రూ.5లక్షలకు పెంచామన్నారు. సొసైటీ రెన్యూవల్ గడువును 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పెంచుతున్నామన్నారు. హరితహారంలో భాగంగా ఈత, ఖర్జూర మొక్కలను నాటుతున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa