హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొలి ఓటు మంత్రి తన్నీరు హరీష్ రావు వేశారు. రాజ్యసభ ఎన్నికలలో ఓటేసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలంతా ప్రత్యేక బస్సులో టీఆర్ఎస్ భవన్ నుంచి అసెంబ్లీకి వచ్చారు. హరీష్ రావు తొలి ఓటు వేయగా, ఆ తరువాత మంత్రి మహేందర్ రెడ్డి ఓటు వేశారు. తెరాస ఎన్నికల ఏజెంట్లుగా రమేష్ రెడ్డి, శ్రవణ్ రెడ్డి, గట్టు రామచంద్రరావులు, కాంగ్రెస్ ఎన్నికల ఏజెంట్లుగా మల్లు రవి, సీతక్క, రేగా కాంతారావు, కోదండరెడ్డి ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa