న్యూఢిల్లి : లోక్‌సభ సమావేశం మంగళవారానికి వాయిదా పడింది. సభలో టిఆర్‌ఎస్, అన్నా డిఎంకె సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి ప్లకార్లులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సమయంలో మంత్రులతో పత్రాల సమర్పణ కార్యక్రమాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ ముగించారు. అనంతరం అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ సభ ఆర్డర్‌లో లేనందున చేపట్టలేకపోతున్నట్లు ప్రకటించారు. తరువాత సభను మంగళవారానికి వాయిదా వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa