ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుంకా ట్రెజరీ కేసులో లాలూకు ఏడేళ్లు జైలు శిక్ష

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 24, 2018, 12:11 PM

రాంచీ: దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఏడేళ్లు జైలు శిక్ష ఖరారైంది. దుంకా ట్రజరీ కేసులో రాంచీ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. దాణా కుంభకోణంలో ఇది నాలుగవ కేసు. ఈ స్కామ్‌లో 3.13 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగింది. డిసెంబర్ 1995 నుంచి 1996 వరకు దుంకా ట్రెజరీ నుంచి ఆ నిధులను స్వాహా చేశారు. 1990లో బీహార్ సీఎంగా ఉన్నప్పుడు లాలూ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. లాలూతో పాటు దాణా కుంభకోణం కేసులో మరో 31 మంది నిందితులుగా ఉన్నారు. బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా మాత్రం ఈ కేసులో నిర్ధోషిగా తేలారు. ఈ కేసులోనూ లాలూ దోషిగా తేలడంతో ఆయన ఇక ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోయారు. దాణా కుంభకోణానికి సంబంధించిన మొదటి కేసులో లాలూకు అయిదేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఆ కేసును 2013లో విచారించారు. ఇక రెండవ కేసులో 2017, డిసెంబర్ 23న తీర్పును ఇచ్చారు. ఆ కేసులో మూడున్నర ఏండ్ల జైలు శిక్ష పడింది. ఇక మూడవ దాణా కేసులో లాలూకు అయిదేళ్ల శిక్ష ఖారారైంది. పాట్నా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసులో విచారణ చేపడుతున్నది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa