ఏఐసీసీ మెంబర్‌గా కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నియామకం కావడంపట్ల స్థానిక కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభాకర్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని పదవులు పొంది పార్టీకి, ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ జిల్లా నాయకులు బండారి బాల్‌రెడ్డి, ఎస్‌కే గౌస్, బ్లాక్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, మాజీ జడ్పీటీసీ ఏలూరి రాజయ్య, కాంగ్రెస్‌పార్టీ బీసీ సెల్ మండలాధ్యక్షుడు కదిరే శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa