ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్లీన్‌ యూ సర్టిఫికెట్‌తో 24న విడుదల కానున్న కాటమరాయుడు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2017, 08:00 PM

హైదరాబాద్‌: నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డాలీ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ నటించిన కాటమరాయుడు సెన్సార్‌ పూర్తి చేసుకుంది. క్లీన్‌ యూ సర్టిఫికెట్‌తో ఈనెల 24న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత శరత్‌ మరార్‌ ప్రకటించారు. ఈ చిత్రంలో ముగ్గురు తమ్ముళ్లకు అన్నయ్యగా పవన్‌ కనిపించనున్నారు. తమిళంలో ఘనవిజయం సాధించిన వీరం చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన కాటమరాయుడులో పవన్‌ సరసన మరోసారి శృతిహాసన్‌ కథానాయకగా నటించింది. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు మెగా అభిమానులను అలరిస్తుండగా త్వరలోనే శిల్పకళా వేదికగా ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa