-పరిశోధనలో వెల్లడి
-తిండి బట్టే సంతాన యోగ్యం.. వీర్యకణాల ఆరోగ్యం
-తాజా పరిశోధనలో వెల్లడి
కోపెన్‌హాగన్ : గాయాలు తగిలినప్పుడు ఏర్పడే నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి భారత్తో పాటు ఎన్నో దేశాల్లో ఇబూప్రోఫెన్ (లేదా బ్రూఫెన్)ను చాలా మంది ఉపయోగిస్తుంటారు. అయితే, ఇష్టం వచ్చినట్లు బ్రూఫెన్‌ను తీసుకుంటే కార్డియాక్ అరెస్టు ముప్పు పెరుగుతుందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. వైద్యుల సలహా కూడా తీసుకోకుండా, ఎంతో మంది తమంతట తాము ఈ మందులను కొనుక్కుని వాడుతున్నారని, అటువంటి వారిలో కార్డియాక్ అరెస్టు ముప్పు 31 శాతం అధికమని డెన్మార్‌క పరిశోధకులు తెలిపారు. డెన్మార్‌కలో 2001 నుంచి 2010 వరకు కార్డియాక్ అరెస్టుతో బాధపడిన సుమారు 29వేల మంది రోగులను పరిశీలించి ఈ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు. కేవలం ఇబూప్రోఫెన్ మాత్రమే కాకుండా డైక్లోఫెనాక్ వల్ల కూడా ఇదే తరహా ముప్పు 50 శాతం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అసలు ఇటువంటి నొప్పి నివారణ మందుల అమ్మకాలను నియంత్రించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని తీసుకుంటే ప్రజారోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుందని అన్నారు. అయితే, నొప్పి నివారణ మందులన్నీ ప్రమాదకరం కాదని, అధికంగా వాడుతున్న ఇబూప్రోఫెన్, డైక్లోఫెనాక్‌ల వల్లే ఈ ముప్పు అధికంగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఇటువంటి మందులను సొంతంగా వాడకూదని పరిశోధకులు సూచించారు.
మనం తీసుకునే ఆహారమే వీర్యకణాల ఆరోగ్యాన్ని, సంతాన సౌభాగ్యాన్ని నిర్ణయిస్తుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. వీర్య కణాలు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే పండ్లు, తాజా కూరగాయలు, తృణ ధాన్యాలు, చేపలు, కొవ్వు సమృద్ధిగా ఉండే మెడిటెర్రేనియన్ వంటి ఆహారాన్ని తీసుకోవాలని అధ్యయనవేత్తలు చెబుతున్నారు. వీర్యకణ నాణ్యత, పురుషుడి పునరుత్పత్తి రేటు- పోషకాహారంపై స్పెయిన్‌లోని రొవిరా-ఐ-వర్జిలి యూనివర్సిటీ, పెరి-ఐ-వర్జిలి ఆరోగ్య పరిశోధన సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా వంధ్యత్వం పెద్ద సమస్యగా పరిణమించిందని, ఇది 15 శాతం మంది దంపతులపై ప్రభావం చూపుతోందని పరిశోధకులు పేర్కొన్నారు. పురుషుల్లో వీర్య కణాల నాణ్యత స్వల్పంగా ఉండడం వల్ల 25 శాతం మంది సంతానహీనులవుతున్నారని తెలిపారు. పీతలు, ఆల్చిప్పలు, చేపలు వంటి సముద్రపు ఆహారంతో పాటు కోళ్లు, కోడిగుడ్లు, కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాలు, వెన్నతీసిన పాలు, కొవ్వు తక్కువగా ఉండే డెయిరీ ఉత్పత్తులు తీసుకోవడం వల్ల వీర్యకణాల నాణ్యత పెరుగుతుందని వారు సూచించారు. అలాగే శుద్ధి చేసిన ఆహారం, బంగాళాదుంపలు, సోయా ఉత్పత్తులు, జున్ను, మద్యం, వెన్న ఎక్కువగా ఉండే డెయిరీ ఉత్పత్తులు, కాఫీ, తీయగా ఉండే పానీయాలు, స్వీట్లు తినేవారిలో వీర్యకణ నాణ్యత తక్కువగా ఉంటుందని అధ్యయనకారులు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa