ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మో! శశికళ ఫోటోనా?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 16, 2017, 12:35 AM

-భయపడుతున్న చిన్నమ్మ మద్దతుదారులు
-జయలలిత కన్నకొడుకును నేను..
-మా అమ్మను శశికళే చంపేసింది
-ఈరోడ్‌కు చెందిన యువకుడి ఆరోపణ

చెనై్న : చిన్నమ్మ శశికళ ఫోటో అంటేనే ఆమె మద్దతుదారులు భయపడిపోతున్నారు. ఎందుకు వచ్చిన గొడవ అంటూ ఆమె ఫోటోకు దూరంగా ఉంటున్నారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జయంతి సందర్భంగా కోవిలంబాక్కంలో సంక్షేమ పథక సహాయాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇందు కోసం పల్లావరం- తురైపాక్కం రోడ్డులో శశికళ వర్గీయులు పెద్ద ఎత్తున భారీ బ్యానర్లను ఏర్పాటు చేశారు. అయితే, వాటిలో ఎక్కడా శశికళ ఫోటో కానీ, పేరు కానీ లేకుండా జాగ్రత్త పడ్డారు. పొరపాటున కూడా ఆమె ఫోటో ప్రింట్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అక్రమార్జన కేసులో  ప్రస్తుతం జైలులో ఉన్న శశికళ ఫోటోను ముద్రిస్తే పార్టీ అభివృద్ధికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని భావించే ఆమె ఫోటో లేకుండానే బ్యానర్లను ముద్రించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటో లేకుండానే ప్రజల్లోకి వెళ్లడం మంచిదని ఆమె వీరాభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు.
 తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుమార్తె అంటూ ఒక యువతి ఫోటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తానే జయలలిత కన్నకొడు కును అంటూ ఈరోడ్‌కు చెందిన కృష్ణ మూర్తి అనే ఓ యువకుడు బయటకు వచ్చాడు. అంతే కాదు. తాను జయ కుమారుడినంటూ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశాడు. ఇంత కాలం తాను జయల లిత స్నేహితురాలు వనితామణి ఇంట్లో తన పెంపుడు తల్లిదండ్రులతో పాటు నివసించానని చెప్పాడు. 2016 సెప్టెంబర్‌ 14న తాను పొయెస్‌ గార్డెన్‌కు వెళ్లానని, ఆ సందర్భంగా నాలుగు రోజుల పాటు అమ్మతోనే ఉన్నానని లేఖలో పేర్కొన్నాడు. తనను ప్రపంచానికి పరిచయం చేసేందుకు జయలలిత సిద్ధమయ్యారని, ఈ విషయం పసిగట్టిన శశికళ సెప్టెంబర్‌ 22న తన తల్లి జయతో గొడవ పడిందని కృష్ణమూర్తి తెలిపాడు. ఆ రాత్రి జయతో శశికళ గొడవ పెట్టుకుందని, వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని చెప్పాడు. ఆ తరువాత తన తల్లిని శశికళ మెట్లపై నుంచి తోసేసిందని తెలిపాడు. తన తల్లిని చంపింది శశికళే అని అతను ఆరోపించాడు. ప్రాణ భయం కారణంగానే ఇన్ని రోజులు తాను ఈ విషయాన్ని బయటపెట్టలేదని, ఇప్పుడు నిజాన్ని ధైర్యంగా వెల్లడిస్తున్నానని చెప్పాడు. జయ ఆస్తులన్నింటికీ కూడా తానే అసలు సిసలు వారసుడినని తెలిపాడు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa