ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడు గంటలకు పైబడి టీవి చూసే పిల్లలకు డయాబెటిస్‌ ప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 16, 2017, 12:38 AM

లండన్‌ : తొమ్మిది నుంచి పది సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలు మూడు గంటలకు పైబడి టీవి చూస్తే కనుక డయాబెటిస్‌ బారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయట. ఈ విషయాన్ని ఆన్‌లైన్‌ జర్నల్‌ ఆర్చివ్‌‌సలోని `డిసీజ్‌ ఇన్‌ చైల్‌‌డహుడ్‌'లో వెల్లడించారు. కేవలం, టీవీలే కాకుండా కంప్యూటర్లు, స్మార్‌‌ట ఫోన్లకు గంటల తరబడి అతుక్కుపోయే పిల్లలకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. రోజూ మూడు గంటల కంటే ఎక్కువ సమయం తాము టీవీ చూస్తుంటామని ఐదుగురు పిల్లల్లో ఒకరు అంటే 18 శాతం పేర్కొన్నట్లు ఆ రీసెర్చిలో తెలిసింది. పరిశోధకుల ప్రకారం, తొమ్మిది నుంచి పది సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు టీవిలు, స్మార్‌‌ట ఫోన్లు, కంప్యూటర్లను వినియోగించే సమయాన్ని తగ్గించుకుంటే కనుక టైప్‌-2 డయాబెటీస్‌ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని సూచించారు. ప్రస్తుతం, టీవిలు, స్మార్‌‌ట ఫోన్లు, కంప్యూటర్లపై యాక్టివిటీస్‌ చేస్తున్న పిల్లల సంఖ్య పెరుగుతోందని, దీని ప్రభావం అనంతర జీవితంపై పడుతుందని అన్నారు. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌, లిసెస్టర్‌లోని 200 ప్రాథమిక పాఠశాలల్లో  9-10 సంవత్సరాల మధ్య వయసు గల సుమారు 4,500 మంది పిల్లలపై సర్వే నిర్వహించామని చెప్పారు. ఆ విద్యార్థుల్లో మెటాబాలిక్‌, కార్డియోవాస్కు్యలర్‌ రిస్‌‌క ఫ్యాక్టర్‌లకు సంబంధించి నిర్వహించిన ఈ సర్వేలో బ్లడ్‌ ఫ్యాట్‌‌స, ఇన్సులిన్‌ రెసిస్టెన్‌‌స, ఫాస్టింగ్‌ బ్లడ్‌ షుగర్‌ లెవెల్‌‌స, బీపీ, బాడీ ఫ్యాట్‌కు సంబంధించి ఆ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించినట్లు పరిశోధకులు తెలిపారు. రోజుకు మూడు గంటలకు పైబడి టీవీ, స్మార్‌‌ట ఫోన్‌, కంప్యూటర్లు వినియోగించే పిల్లల్లో బీపీ, బాడీ ఫ్యాట్‌, ఫాస్టింగ్‌ బ్లడ్‌ షుగర్‌ స్థాయిలు అత్యధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. అబ్బాయిల్లో 22 శాతం, అమ్మాయిల్లో 14 శాతం మంది తాము రోజూ మూడు గంటలకు పైబడి టీవీ, స్మార్‌‌ట ఫోన్‌, కంప్యూటర్ల ముందు గడుపుతామని చెప్పారు. వీటి ముందు గంటల తరబడి గడపడం కారణంగా లెప్టిన్‌ హార్మోన్‌ స్థాయిల్లో మార్పులు సంభవించడంతో దాని ప్రభావం ఆకలి, ఫాస్టింగ్‌ గ్లూకోజ్‌, ఇన్సులిన్‌ రెసిస్టెన్‌‌సలపై పడుతుందని పరిశోధకులు వెల్లడించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa