ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పద్మావతి చిత్రం షూటింగ్‌ సెట్‌ విధ్వంసంపై వర్మ ఆగ్రహం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 16, 2017, 12:39 AM

ముంబయి : బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ పిరియడ్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్న `పద్మావతి' చిత్రం షూటింగ్‌ సెట్‌లో గుర్తు తెలియని పలువురు వ్యక్తులు పెట్రోల్‌ బాంబులు విసిరి సెట్‌ను పూర్తిగా ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జరిగిన ఈ ఘటనపై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ స్పందించాడు. `పద్మావతి' సినిమా సెట్‌పై మళ్లీ దాడి జరిగిందా అని వర్మ తన ట్విటర్‌‌ట ఖాతాలో పేర్కొన్నాడు. తనకు తెలిసి భారతీయులు ప్రాచీన కాలానికే వెళ్లిపోతున్నారని, ఇది సిగ్గుపడవలసిన విషయం అని వర్మ అన్నాడు. తనకు తెలిసి సంజయ్‌ లీలా భన్సాలీకి పద్మావతి కథ గురించి ఎంత తెలుసో అందులో ఒక శాతం కూడా తెలియనివారే ఈ దాడులకు పాల్పడుతున్న వారికి తెలియదని వర్మ అన్నాడు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa