కేరళలోని తొమ్మిది జిల్లాలు కరువు వాత పడినట్లు ఆ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (కెఎస్‌డిఎంఎ) గుర్తించింది. ఈమేరకు ప్రకటన చేయాలని మఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షత జరిగిన ఈ అథారిటీ సమావేశం స్టేట్ రిలీఫ్ కమిషనర్‌కు సూచించింది. కరువు ప్రభావిత జిల్లాల్లో అలప్పుజా, కన్నూర్, ఇడుక్కి, కసరగాడ్, కోజికోడ్, మలప్పురం. పాలకాడ్, త్రిసూర్, వాయనద్ ఉన్నాయి. వర్షపాతం లోటు, ఉపరిత, భూగర్భజలాల లభ్యత, తాగునీటి సమస్య తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ జిల్లాలను కరువు జిల్లాలుగా ప్రకటించాలని సమావేశం నిర్ణయించింది. కరువు జిల్లాల్లో తక్షణం ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేయించాలని నిర్ణయించారు. తాగునీటి సరఫరాకు ఆయా స్థానిక ప్రభుత్వ సంస్థలకు తగినన్ని నిధులు లేకుంటే డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ నుంచి అందించాలని సమావేశం నిర్ణయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa