ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి రూపాయి విలువైనది... ఆడంబరాలు వద్దు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 16, 2017, 12:42 AM

చండీగఢ్‌ : ఈ నెల 16న పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మా ట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ఎలాంటి ఆడంబరాలకూ పోవద్దని సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమీ బాగా లేదని ఆయన చెప్పారు. ఇలాంటి సమయంలో అట్టహాసాలు మంచిది కాదని అన్నారు. రాజ్‌ భవన్‌లో తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సాదా సీదాగా నిర్వహించాలని ఆయన సూచించారు. `మనం ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో వృథా ఖర్చులు సరి కాదు' అని ఆయన చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం తాను ప్రతి జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు. ఆ సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా ఊరేగింపులు, బాణాసంచా కాల్పులు వద్దని ఆయన సూచించారు. పంజాబ్‌కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రజలంతా తనకు సహకరించాలని అమరీందర్‌ కోరారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa