ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపే అర్హత శశికళకు లేదు : విరుచుకుపడ్డ పన్నీర్‌ సెల్వం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 16, 2017, 12:43 AM

చెనై్న : జయలలిత మృతి తరువాత తమిళనాడులోని అధికార అన్నా డీఎంకేలో విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో పళనిస్వామి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఆ పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్‌ నియోజక వర్గానికి వచ్చే నెల 12న ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అన్నా డీఎంకే నుంచి దినకరన్‌ను అభ్యర్థిగా ప్రకటించిన అంశంపై పన్నీర్‌ సెల్వం విమర్శలు చేశారు. ఆ పార్టీ తరƒఫున అభ్యర్థులను నిలిపే అర్హత శశికళకు లేదని అన్నారు. ఆయనను ఎన్నికల కమిషన్‌ అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అన్నా డీఎంకే పార్టీకి, దినకరన్‌కు ఎలాంటి సంబంధమూ లేదని ఆయన పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa