ముంబయి: హ్యాట్రిక్ ఓటముల తర్వాత భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ స్మృతి మంధాన చెలరేగి ఆడటంతో భారత జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 18.5 ఓవర్లలో 107 పరుగులు చేసి ఆలౌటయ్యిందిఈ సిరీస్‌లో ఇదే చివరి మ్యాచ్. ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావించిన టీమిండియా 108 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది. ఓపెనర్ స్మృతి మంధాన మరోసారి చెలరేగి ఆడింది. 41 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 62 పరుగులు చేసింది. దీంతో 15.4ఓవర్లలోనే భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సిరీస్‌లో భారత్‌కు ఇదే తొలి విజయం. అంతకుముందు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోయింది. దీంతో ఫైనల్ పోరుకు రేసులో నిలవలేకపోయింది. దీంతో ఈ రోజు భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ నామమాత్రపు పోరే. శనివారం ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ జరగనుంది.
అనూజ పాటిల్‌కు 3, దీప్తి శర్మ, రాధ యాదవ్, పూనమ్ యాదవ్‌కు తలో రెండు, పూజకు ఒక వికెట్ దక్కింది. అనూజ పాటిక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa