ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతన పంచాయతీరాజ్, పురపాలక బిల్లులపై చర్చ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 29, 2018, 02:41 PM

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో నూతన పంచాయతీరాజ్, పురపాలక బిల్లులపై చర్చను చేపట్టారు. సభ్యులు కిషన్‌రెడ్డి, సున్నం రాజయ్య, ఆర్. కృష్ణయ్యలు బిల్లుపై లేవనెత్తిన ప్రశ్నలకు, సందేహాలకు సీఎం కేసీఆర్ సమాధానమిస్తూ బిల్లు రూపకల్పనకు జరిగిన కృషిని సవివరంగా తెలియజేశారు. పంచాయతీరాజ్ చట్టం ఏర్పాటు, ఇప్పటి వరకు జరుగుతున్న నిర్వహణను వివరించి.. నూతన బిల్లు రూపకల్పనలో తీసుకున్న సలహాలు, చేసిన మేథోమథనాన్ని వివరించారు. నూతన పంచాయతీరాజ్ బిల్లును తొందరపాటుగా తీసుకురావడం లేదని.. అనేకమంది సలహాలు, సూచనలు, ఎన్నో చర్చల అనంతరమే తాము బిల్లు రూపకల్పన చేశామని.. నూతన పంచాయతీరాజ్, పురపాలక బిల్లులకు విపక్ష సభ్యులు సహకరించి ఆమోదం తెలపాల్సిందిగా సీఎం కోరారు.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa