ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐసీఐసీఐ బ్యాంకుకు‌ రూ.58.9 కోట్ల జరిమానా, ఎందుకంటే?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 29, 2018, 02:14 PM

ఐసిఐసీఐ బ్యాంక్‌కు ఆర్భీఐ రూ.58.9 కోట్ల జరిమానాను విధించింది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించింనందుకు గాను రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకొంది బ్యాంకింగ్ మార్గదర్శకాలను ఐసీఐసీఐ విరుద్దంగా వ్యవహరించిందని ఈ మేరకు ఆర్భీఐ నోటీసులు జారీ చేసింది.ప్రైవేట్ బ్యాంకింగ్ ధిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చింది. రెండు రోజుల క్రితం ఆర్భీఐ నోటీసులను జారీ చేసింది. సెక్యూరిటీల అమ్మకంలో ఆర్భీఐ మార్గదర్శకాలను ఐసీఐసీఐ ఉల్లంఘించిందని ఆర్భీఐ ఆ నోటీసులో పేర్కొంది. ఈ మేరకు సుమారు రూ. 58.9 కోట్లను పెనాల్టీ విధిస్తున్నట్టు గురువారం నాడు ప్రకటించింది.బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 ప్రకారంగా వ్యవహరించాలని ఆర్భీఐ సూచించింది. ఈ మార్గదర్శకాలను అన్ని బ్యాంకులు పాటించాలని స్పష్టం చేసింది. ఆర్భీఐ హెచ్‌టీఎం పోర్ట్‌ఫోలియో నుండి నేరుగా సెక్యూరిటీల అమ్మకాలపై ఐసీఐసీ బ్యాంకుకు రూ.58.9 కోట్ల జరిమానాను విధించింది.


ఈ కేటగిరి కింద మొత్తం పెట్టుబడులు బ్యాంకు మొత్తం పెట్టుబడిలో 24 శాతానికి మించకూడదు. అయితే ఆర్భీఐ నిబంధనలను మరికొన్ని బ్యాంకులు కూడ ఉల్లంఘించాయి. దీంతో ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకులకు ఆర్భీఐ జరిమానా విధించింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa