ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం కేసీఆర్ తో కలిసి అసెంబ్లీకి వచ్చిన సినీ నటుడు ప్రకాష్ రాజ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 29, 2018, 02:10 PM

నటుడు ప్రకాష్ రాజ్ తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు. సీఎం కేసీఆర్‌తో కలిసి వచ్చిన ఆయన... ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కాసేపు ముచ్చటించారు. తర్వాత అసెంబ్లీని పరిశీలించారు. మధ్యాహ్నం కేసీఆర్‌తో కలిసి ప్రగతి భవన్‌లో లంచ్ చేసి... ఇద్దరు భేటీ అవుతారు. అయితే ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించేందుకు ప్రకాష్ వచ్చినట్లు తెలుస్తోంది. గౌరీ లంకేశ్ హత్య జరిగినప్పుడు ప్రకాష్ రాజ్ మోదీ, బీజేపీ నేతలపై విమర్శలు చేశారు. అలాగే జీఎస్టీపై కూడా మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకం కావడంతో... ఈ నటుడ్ని కూడా ఫెడరల్ ఫ్రంట్‌లో చేరాలని కేసీఆర్ ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది.ఫెడరల్ ఫ్రంట్‌పై కేసీఆర్ ఇప్పటికే దూకుడు పెంచారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.... జార్ఖండ్ మాజీ సీఎం సోరెన్‌తో కూడా సమావేశమయ్యారు. త్వరలోనే మరికొంతమంది నేతల్ని తెలంగాణ సీఎం కలిసే అవకాశముంది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa