ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీహార్‌ మత ఘర్షణల నిందితుడు పరార్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 30, 2018, 11:56 AM

  పాట్నా : బీహార్‌ జౌరంగాబాద్‌లోని శ్రీరామనవమి వేడుకల్లో మత ఘర్షణలకు పాల్పడిన కేసులో అరెస్టైన బిజెపి కార్యకర్త అనిల్‌ సింగ్‌ పోలీస్‌ కస్టడీ నుండి తప్పించుకున్నాడు. అనిల్‌ సింగ్‌ హిందూ సేవా సమితి అనే సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నాడు. అనిల్‌ సింగ్‌ను స్థానిక కోర్టుకు తీసుకెళ్లినప్పుడు పరారయ్యాడని పోలీస్‌ సూపరింటెండెంట్‌ సత్య ప్రకాష్‌ తెలిపారు. ఈ సంఘటన పట్ల నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. నవాదిహ్‌ కాలనీలో శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా ఓ బృందం 20 షాపులకు నిప్పంటించి, రాళ్లను రువ్విన సంగతి తెలిసిందే. నివేదికల ప్రకారం 50 షాపులకు నిప్పంటించగా, రాళ్ళ రువ్విన ఘటనలో 20 మంది పోలీసులతో సహా 60 మంది గాయపడ్డారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa