ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఆఖరి పోరాటం ఆరంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 30, 2018, 02:21 PM

జోహాన్నెస్‌బర్గ్‌: అంతర్జాతీయ క్రికెట్లో ప్రకంపనలు సృష్టించిన బాల్ టాంపరింగ్ వివాదంపై చర్చ జరుగుతుండగానే ఆస్ట్రేలియా జట్టు మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆతిథ్య సౌతాఫ్రికా జట్టుతో ఆఖరి పోరాటానికి ఆసీస్ బరిలో దిగింది. జోహాన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కీలకమైన ఈ టెస్టులో గెలిచి స్వదేశంలో చరిత్ర సృష్టించాలని దక్షిణాఫ్రికా.. సిరీస్‌ను సమం చేయాలని ఆసీస్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. సిరీస్‌లో సౌతాఫ్రికా 2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్‌క్రాప్ట్ లేకుండా కంగారూలు బరిలో దిగారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa