ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బడ్జెట్‌లో అంకెలు తప్ప వాస్తవం కనబడడం లేదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 16, 2017, 01:19 AM

-డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం ఎప్పటిలోగా పూర్తి చేస్తారు ?  
-మద్యం ద్వారా ఆదాయం రాబట్టుకోవాలను కోవడం సరికాదు  
-రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణాగా మారుస్తున్నారు
-ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పటిలోగా పూర్తి చేస్తారు ?
ప్రభుత్వం పై  అసెంబ్లీలో ధ్వజమెత్తిన కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ః రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అంకెలే తప్ప.. వాస్తవాలు కనబడటం లేదని బీజేపీ ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం శాసనసభలో బడ్జెట్‌పై నిర్వహించిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత రెండేళ్ల బడ్జెట్‌ కేటాయింపుల్లో 60, 70శాతం నిధులు మాత్రమే ఖర్చు పెడుతున్నారని, లేనిది ఉన్నట్లుగా చూపించి అసెంబ్లీ సాక్షిగా ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు. మధ్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కానీ దాని ద్వారా రూ.19వేల కోట్లు ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ప్రజలను మద్యానికి బానిసలుగా మారుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాషా్టన్న్రి బంగారు తెలంగాణగా చేస్తామని చెప్పి బాకీల తెలంగాణగా మారుస్తున్నారని, ప్రస్తుత లెక్కల ప్రకారం రాష్ట్ర అప్పు రూ.1.40 కోట్లకు చేరుకుందన్నారు. ఇక డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి మిషన్‌ భగీరథ కోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఏటా అప్పుల చెల్లింపుల కోసమే రూ.15,700 కోట్లు అవుతుందన్నారు. అన్ని మండల కేంద్రాలలో 30 పడకల ఆసుపత్రులు, నియోజకవర్గ కేంద్రాల్లో 100 పడకల ఆసుపత్రులు కడతామని హామీ ఇచ్చారని, ప్రతి జిల్లాకు నిమ్‌‌స తరహా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి హామీ ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు. గాంధీ, నిమ్‌‌స ఆస్పత్రులకు రూ.100కోట్ల చొప్పున ఇస్తామన్నారని, ఆ హామీ ఏమైందన్నారు. ఇంకా ఒక్క బడ్జెట్‌ మాత్రమే మిగిలి ఉందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారో సమాధానం చెప్పాలన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లపై ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారని, మూడేళ్లలో ఎన్ని ఇళ్లు కట్టారో ప్రభుత్వం స్సష్ట ం చేయాలన్నారు. విద్యుత్‌ సర్‌చార్జీల రద్దు హామీ ఏమైందని కిషన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa