-హోమ్‌గార్డులకు ప్రమాద బీమా పథకం
-పోలీసు బలగాల ఆధునీకరణ
-సమాచార నెట్‌వర్‌క డిజిటలైజేషన్
-పోలీసు శాఖకు రూ. 5,221 కోట్లు
-సరికొత్త వ్యవస్థ అందుబాటులో
వెలగపూడి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : నవ్యాంధ్రలో శాంతిభద్రతలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. కొత్త రాష్ర్టంలో ప్రజల రక్షణ కోసం పోలీసు శాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. పాత పద్ధతలకు స్వస్థి పలికి కొత్తగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక టెక్నాలజీని ఆకళింపు చేసుకుని నేరాలకు చెక్‌పెట్టేలా సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇందుకు అనుగుణంగా ఈ యేడాది పోలీసు శాఖకు 201718 సంవత్సరానికి గాను రూ. 5,221 కోట్లు కేటాయించారు. ఏ సమాజమైనా సుస్థిరంగా, సురక్షితంగా, భద్రంగా వుండాలంటే శాంతిభద్రల నిర్వహణ అత్యంత అవసరం. ఏ ప్రభుత్వానికి అయినా అది ఒక ప్రాథమిక బాధ్యత రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకుంటున్న క్రమంలో పోలీసు బలగాలను కూడా ఆధునీకరించాల్సిన అవసరాన్ని దృష్టిలో వుంచుకున్న ప్రభుత్వం పోలీసు సమాచార నెట్‌వర్‌కను డిజిటలైజేషన్ చేయడంతోపాటు డయల్ 100 వ్యవస్థతో దానిని అనుసంధానించారు. అందరు పోలీసులు, అధికారులతోపాటు హోంగార్డులను కూడా గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్‌స పథకం క్రిందకు తీసుకువచ్చారు. పెట్టుబడులు పెట్టడం ద్వారా, వాణిజ్య సంస్థలను నెలకొల్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తమ స్వంతగా భావించనున్న పెట్టుబడి దారులకు రాష్ర్టంలోని సుస్థిర శాంతి భద్రతలకు ధైర్యాన్ని ఇవ్వగలవు కాబట్టి రాష్ర్టంలోని పోలీసు బలగాలను ఆధునీకరించడానికి, వారు ప్రజా అవసరాల పట్ల మరింత బాధ్యతతో మెలిగే విధంగా తీర్చిదిద్దడానికి కృషి కొనసాగించాల్సివుంటుందన్న అంశంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది.
క్రీడల కోసం రూ. 195 కోట్లు: క్రీడల ద్వారా అందరికీ ఆరోగ్యం సమకూరా లన్న నినాదంతో 201718 సంవత్సరానికి శాప్‌కు రూ. 195 కోట్లు కేటాయిం చారు. ఈ యేడాది 75 క్రీడా వికాస కేంద్రాలను నిర్మించారు. మిగిలిన నియోజ కవర్గాల్లో మంజూరైన క్రీడా వికాస కేంద్రాలు 201718లో పూర్తి అవుతాయి. ఉత్తరాంధ్ర, దక్షిణ తీరాంధ్ర రాయలసీమ జిల్లాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన 3 క్రీడా సముదాయాలను నిర్మించాలని శాప్ ప్రతిపాదించింది. రాష్ర్ట స్పోర్‌ట్స అకాడమీని స్థాపించాలని కూడా శాప్ సంకల్పిస్తుంది. తద్వారా 6 కేంద్రాలలో 15 క్రీడలను, 4 కేంద్రాలలో వాటర్ స్పోర్‌ట్సను ప్రోత్సహిస్తున్నారు.
యువతరం కోసం రూ. 500 కోట్లు: తక్కిన సంక్షేమ శాఖల నుండి కూడా నిధులను కల్పి కూడగట్టుకుంటూ అమలు చేయగల ఒక యువత విధానానికి తుది మెరుగులు దిద్దారు. ఈ విధానం ద్వారా 201718 ఆర్థిక సంవత్సరంలో ముందుగా 500 కోట్ల కేటాయింపును ప్రతిపాదించారు. తద్వారా తమ శక్తి సామర్థా్యలను సాంఘిక సేవా రంగంలో వినియోగించడానికి వీలుగా నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఇందుకు సంబంధించి విధి విధానాలు సమగ్రంగా రూపొందనున్నాయి. అలాగే యువ సంక్షేమానికి సంబంధించిన ఇతర పథకాలకు గాను రూ. 275 కోట్లు ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa