ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కొత్త అవతారం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 31, 2018, 11:07 AM

శ్రీనగర్: భారత సీనియర్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కొత్త అవతారం ఎత్తాడు. చాలా ఏళ్ల నుంచి జాతీయ జట్టులో అతడు చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. 2018-19 సీజన్‌లో జమ్ము కశ్మీర్ రాష్ట్ర సీనియర్ జట్టుకు పఠాన్‌ను కోచ్, మెంటార్‌గా నియమించినట్లు జమ్ము, కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్(జేకేసీఏ) తాజాగా వెల్లడించింది. ఏడాది పాటు కోచ్-కమ్-మెంటార్‌గా తమ జట్టుకు పనిచేస్తారని జేకేసీఏ సీఈవో ఆషీఖ్ బుకారీ తెలిపారు. 33ఏళ్ల పఠాన్ భారత్ తరఫున 2003 నుంచి 2012 మధ్య 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. గత రెండు దేశవాళీ సీజన్లలో బరోడా జట్టుకు పఠాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. షేర్-ఏ- కశ్మీర్ క్రికెట్ స్టేడియంలో స్థానిక యువ ఆటగాళ్లను కలిసి మాట్లాడాడు. ఆటలో ఉన్నతస్థాయికి చేరాలంటే కఠిన సాధన చేయాలని వారికి సూచించాడు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa