హైదరాబాద్: ఐపీఎల్ సందడి మరికొద్ది రోజుల్లో మొదలుకానుంది. క్రికెట్ ఫ్యాన్స్ ఆ తరుణం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 7నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్యాన్స్‌కు హైదరాబాద్ మెట్రో తీపి కబురందించింది. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంతో ఆ మార్గంలో ప్రస్తుతం నడుస్తున్న మెట్రో రైళ్లను అర్థరాత్రి 12.30 గంటల వరకూ పొడిగిస్తున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. ఏప్రిల్, మే.. ఈ రెండు నెలల పాటు ఈ పొడిగింపు కొనసాగనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ మార్గంలో మెట్రో రైళ్లను రాత్రి 10.00 గంటల వరకే నడుపుతున్నారు. మెట్రో తీసుకున్న నిర్ణయంపై ఐపీఎల్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa