ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొండగట్టుపై ఘనంగా చిన్న జయంతి వేడుకలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 31, 2018, 11:59 AM

 తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం హనుమాన్‌ చిన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈనెల 29 నుంచి ప్రారంభమైన ఉత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి. శనివారం నిర్వహించిన చిన్న జయంతి వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి దాదాపు లక్ష మంది హనుమాన్‌ దీక్షాపరులు తరలివచ్చారు. వారు స్వామి వారికి ముడుపులు చెల్లించి, మాల విరమణ చేసి అంజన్నను దర్శించుకొన్నారు. ఈసందర్భంగా ఆలయంలో మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.ఆలయ ఈవో అమరేందర్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ ఆధ్వర్యంలో సుమారు 300 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తాగునీటి సమస్య, కోనేరులోకి నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ఆలయ పరిసరాల్లో దీక్షాపరులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa