హైదరాబాద్‌లో హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. ఉదయం గౌలిగూడ నుంచి యాత్ర ప్రారంభమయ్యింది. వందలాది వాహనాలు, వేలాదిమందితో కొనసాగుతోంది. దారి పొడవునా భజనలు, డప్పు వాయిద్యాలు, జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగుతున్నాయి. యువకులు కూడా భారీ బైక్ ర్యాలీ తీశారు. ఉదయం గౌలి గూడ నుంచి ప్రారంభమైన యాత్ర... తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు కొనసాగనుంది. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా శోభాయాత్రను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 14వేలమంది పోలీసులతో భద్రతను కల్పించారు. సీపీ అంజనీ కుమార్ దగ్గరుండి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. యాత్ర కొనసాగే మార్గంలో అక్కడక్కడా ట్రాఫిక్‌ను కూడా మళ్లించారు. అలాగే మద్యం షాపుల్ని కూడా మూసి వేయించారు. ముందస్తు జాగ్రత్తగా రౌడీషీటర్లతో పాటూ అనుమానితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa