జాతీయ రహదారులపై వెళ్తున్నారా.. అయితే ఇకపై మీకు మరింత బాదుడు తప్పదు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) జాతీయ రహదారులపై టోల్ రేట్లను 5 నుంచి 7శాతం సవరించింది. దీని ప్రకారం.. టోల్ రేట్లు పెరగనున్నట్లు ట్రాన్స్‌పోర్టర్లు చెబుతున్నారు.
రేట్ల పెంపుపై నేషనల్ హైవే-2 ప్రాజెక్ట్ డైరెక్టర్ మహ్మద్ సఫీ ఓ మీడియాతో మాట్లాడారు. ‘దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై 372 టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో టోల్ రేట్లను సవరిస్తాం. టోకు ధరల సూచీ ఆధారంగా ఈ రేట్లను సవరిస్తాం. ఇవి ఒక్కో టోల్ ప్లాజాకు ఒక్కో రకంగా ఉంటాయి. నేషనల్ హైవే-2పై టోల్ ధరలను ఈ సారి 5శాతం పెంచాం’ అని తెలిపారు.
పెంచిన ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. చాలా ప్లాజాల్లో 5శాతం పెరగగా.. కొన్ని చోట్ల 7శాతం వరకు పెరిగాయి. నెలవారీ టోల్ పాస్‌లపై కూడా ధరలు పెరిగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa