ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ స్థానంలో ఇంగ్లాండ్ విధ్వంసకర ఓపెనర్ అలెక్స్ హేల్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎంపిక చేసుకుంది. రిజిస్టర్డ్ అండ్ అవేలబుల్ ప్లేయర్ పూల్(ఆర్‌ఏపీపీ) నుంచి ఐపీఎల్ వేలం సందర్భంగా అతని కనీస ధర రూ.కోటి వెచ్చించి సన్‌రైజర్స్ తీసుకున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. వార్నర్ తరహాలోనే ఓపెనింగ్‌లో చెలరేగే నైపుణ్యం అతనిలో ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ హిట్టర్ వైపే హైదరాబాద్ యాజమాన్యం మొగ్గుచూపింది. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ తరఫున టీ20ల్లో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు హేల్స్ కావడం విశేషం. ఐసీసీ టీ20 టాప్-10 ర్యాంకింగ్స్ జాబితాలో ఇంగ్లీష్ ప్లేయర్ హేల్స్ కొనసాగుతున్నాడు. బాల్ టాంపరింగ్ వివాదంలో డేవిడ్ వార్నర్‌పై నిషేధం పడటంతో అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌కు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించారు. హేల్స్ కన్నా ముందు శ్రీలంక ఆటగాడు కుశాల్ పెరీరాను తీసుకోవాలని సన్‌రైజర్స్ భావించింది. అంతర్జాతీయ క్రికెట్లో 52 టీ20లు ఆడిన హేల్స్ 1456 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 7 అర్ధశతకాలున్నాయి. అత్యధిక స్కోరు 116.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa