హైదరాబాద్ : రాజేంద్రనగర్‌లోని వరి పరిశోధన సంస్థలో వ్యవసాయ శాస్త్రవేత్తల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతికి శాస్త్రవేత్తలు, ఐసీఐఆర్, ఐఐఆర్‌ఆర్ సిబ్బంది ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని సూచించారు. వ్యవసాయానికి టెక్నాలజీని జోడించి పంట దిగుబడిని పెంచాలన్నారు. వరిని సిరులు కురిపించే పంటగా మార్చాలన్నారు. వ్యవసాయం జీవనాధారం కావాలని చెప్పారు. పరిశోధనలు రైతుల వద్దకు చేరినప్పుడే ప్రయోజనం ఉంటుందని తెలిపారు. పరిశోధనల్లో ఇంకా వేగం పెంచి కొత్త ఆవిష్కరణలను తీసుకురావాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి తీసుకెళ్లాలి. రైతులకు నూతన సాంకేతికత ఉపయోగించేలా సూచనలు చేయాలని శాస్త్రవేత్తలకు వెంకయ్యనాయుడు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa