ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2019లోనూ టీఆర్‌ఎస్‌దే అధికారం : జగదీశ్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 31, 2018, 04:37 PM

హైదరాబాద్ : ప్రస్తుతం యావత్ భారతదేశం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందని.. 2019లోనూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌దే అధికారమని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన బండారు బాల నరసింహ ఇతర పాలకవర్గం ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాష్ట్రంలో విపక్షాలు కేవలం ఉనికి కోసమే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. దేవరకొండ లాంటి ప్రాంతానికి తాగు, సాగు నీరు అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. నామినేటెడ్ పదవులలో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa