-అవిభక్త వరంగల్ జిల్లాకు మరో అరుదైన గౌరవం
-ములుగు ఏజెన్సీని స్వదేశి దర్శన్‌లో ప్రకటించిన కేంద్రం
-ఏటా 98 కోట్ల రూపాయల నిధులు
-ములుగుగ ట్టమ్మ నుండి ఏటూరు నాగారం వరకు అభివృద్ది
-రాష్ట్ర ప్రభుత్వం నుండి మరో 30 కోట్ల నిధులు మంజూరు
మేజర్‌న్యూస్ తెలంగాణ ప్రతినిధి ః పర్యాటక రంగంలో అవిభక్త వరంగల్ జిల్లాకు మరో అరుదైన గౌరవం దక్కింది. జిల్లాలోని ములుగు ఏజెన్సీ ప్రాంతాన్ని స్వదేశీ దర్శన్ పథకంలో చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ప్రతి ఏడాది పర్యాటక రంగ అభివృద్ది కోసం ఏజెన్సీ ప్రాంతానికి 98 కోట్ల రూపాయల నిధులను విడుదల చే స్తారు. అంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని చారిత్రక కట్టడాల అభివృద్దికి ఏటా 30 కోట్ల రూపాయల నిధులను ఇచ్చేందుకు అంగీకరించింది. స్వయానా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చందులాల్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం ములుగు కావడంతో ఆయన ఈ ప్రాంత అభివృద్ది కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ములుగు పట్టణ సమీపంలోకి గట్టమ్మ దేవాలయం వద్ద నుండి ఏటూరునాగారం మండలంలోని లయోలా జలపాతం వరకు ఉన్న పర్యాటక ప్రాంతాలను ఈ నిధులతో అభివృద్ది చేస్తారు. గిరిజన కుంభమేళాగా పిలుచుకునే మేడారం సమ్మక్క, సారలక్క జాతర, లక్నవరం చెరువు, రామప్ప గుడి, లయోలా జలపాతం, హేమాచల లక్ష్మినర్శింహస్వామి ఆలయం లాంటి అటవీ అందాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందుకే కోట్లాది రూపాయల నిధులతో అక్కడ అభివృద్ది పనులను చేపట్టేందుకు నిర్ణయించాయి. ఇప్పటికే లక్నవరం చెరువు అందాలను చూసి తరించేందుకు దేశంలోని వివిధ రాషా్టల్రకు చెందిన పర్యాటకులు ప్రతిరోజు వస్తున్నారు. వర్షాకాలంలో ఇక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటున్నారు. ఊయల, గెస్‌ట హౌజ్ వంటివి ఇప్పటికే అక్కడ అందుబాటులో ఉన్నాయి. రామప్ప ఆలయం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మేడారంలో జాతర సమయంలో కాకుండా ఇతర రోజులలో కూడ భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో కనీస సౌకర్యాలతో పాటు విఐపి గెస్‌టహౌజ్‌ల నిర్మాణం, కాటేజిలు నిర్మించేందుకు పర్యాటక శాఖ అధికారులు అంచనాలు రూపొందించారు. దీంతో మేడారం ఆలయం రూపురేఖలు మారిపోనున్నాయని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు. లయోలా జలపాతం వద్దకు వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. ఇపడు కేంద్రం ఇస్తున్న నిధులతో రోడ్లు వంటి సౌకర్యాలను మెరుగు పరుస్తామని అధికారులు చెబుతున్నారు. ఇటీవలే కేంద్రం ఓరుగల్లు నగరాన్ని స్మార్‌ట సిటీగా ప్రకటించింది. చారిత్రక వారసత్వ సంపద ఉన్న నగరాలను హృదయ్ పథకంలోను చేర్చింది. ఇందులో వరంగల్ కూడ ఉంది. తాజాగా స్వదేశీ దర్శన్‌లో ములుగు ఏజెన్సీ చేరడంతో ఓరుగల్లు జిల్లా ప్రజలు ఆనందంగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa