ట్రెండింగ్
Epaper    English    தமிழ்

`ఐసీసీ'కి శశాంక్‌ రాజీనామా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 16, 2017, 01:36 AM

దుబాయ్‌ : అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌లో మరో వూహించని పరిణామం చోటుచేసు కుంది. గత కొద్ది రోజులుగా భారత క్రికెట్‌ నియంత్రణ మం డలి (బీసీసీఐ), అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మధ్య విభేదాలు చోటుచేసుకున్న విష యం ఇప్పడు మరింత ముదిరినట్లు కనిపిస్తున్నా యి. ఈ నేపథ్యంలో ఐసీసీ ఛైర్మన్‌ పదవిలో కొనసాగుతున్న శశాంక్‌ మనోహర్‌  బుధవారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తీసుకున్న నిర్ణయం తక్షణమే అమలులోకి రా నుంది. గƒత ఏడాది బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్న మనోహర్‌ ఐసీసీకి ఎన్నికైన తొలి స్వతంత్ర ఛైర్మన్‌గా రికార్డులకెక్కాడు. అయితే ఆయన ఆ పదవి స్వీకరించి ఇంకా రెండేళ్లు కూడా పూర్తి కాకుండానే.. తన రాజీనామా లేఖ ను ఐసీసీ కార్యనిర్వహణాధికారి డేవిడ్‌ రిచర్‌‌డసన్‌ కు పంపారు. రాజీనామా నేపథ్యంలో తాను రాసి న లేఖలో... ``నేను అత్యుత్తమ పనితీరు కనబ ర్చేందుకు ప్రయత్నించాను. బోర్డు పరిపాలనలో పారదర్శకతతో నిర్ణయాలు తీసుకున్నాను. అందరి డెరెక్టర్ల మద్దతుతో సభ్యదేశాల సమస్యలు పరిష్కరించేందుకు న్యాయబద్ధంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాను. నా వ్యక్తిగత కారణాల వల్ల ఆగస్టు వరకూ ఐసీసీ ఛైర్మన్‌గా కొనసాగలేను. తక్షణమే ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తున్నాను. నాకు అండగా నిలిచిన డెరెక్టర్లు, మేనేజ్‌మెంట్‌, ఐసీసీ సిబ్బంది అందరికి ధన్యవాదాలు. భవిష్యత్‌లో ఐసీసీ ఉన్నతశిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ... శుభాకాంక్షలు తెలుపుతున్నాను'' అని శశాంక్‌ తన లేఖలో పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa