చిన్నప్పట్నుంచి సినీ వాతావరణంలో పెరిగిన వాళ్లలోకొందరికి సినిమాల గురించి తప్ప బయటి విషయాలు అస్సలు తెలియవు. వాళ్ల జనరల్ నాలెడ్జ్ చాలా పూర్ గా ఉంటుంది. బాలీవుడ్ లెజెండరీ ఫిలిం మేకర్ మహేష్ భట్ తనయురాలు ఆలియా భట్ తెలివి తేటల గురించి అందరికీ తెలిసిందే. కరణ్ జోహార్ నిర్వహించే ఓ కార్యక్రమంలో ఆమె మన రాష్ట్రపతి ఎవరు అంటే పృథ్వీరాజ్ చౌహాన్ అని బదులిచ్చి షాకిచ్చింది. ఇంకా మరిన్ని జీకే క్వశ్చన్లకు ఇలాంటి సమాధానాలే ఇచ్చింది. దీనిపై ఆమెను ఓ రేంజిలో ట్రోల్ చేస్తుంటారు జనాలు. ఇప్పుడు ఈ కోవలోనే మరో సినీ వారసుడు తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడు. అతనెవరో కాదు.. జాకీష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్.
ఇటీవలే ‘భాగి-2’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు టైగర్. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఒక టీవీ కార్యక్రమానికి వెళ్లాడు టైగర్. అక్కడ యాంకర్ మన రాష్ట్రపతి ఎవరు అని అడిగారు. చాలా కష్టమైన ప్రశ్న అడిగేశారే అన్న టైగర్.. ప్రణబ్ ముఖర్జీ పేరు చెప్పాడు. ప్రణబ్ ఐదేళ్ల పదవీ కాలం ముగించుకుని గత ఏడాదే నిష్క్రమించారు. ఆయన స్థానంలో రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి అయిన సంగతి తెలిసిందే. ఇలాంటి బేసిక్ జనరల్ నాలెడ్జ్ కూడా లేదేంటి అంటూ టైగర్ ను సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కాకపోతే ఆలియాతో పోలిస్తే ఇతను కొంచెం బెటర్.. మాజీ రాష్ట్రపతి పేరు చెప్పారంటే కొందరు అతడిని సమర్థిస్తున్నారు. ఐతే టైగర్ తో పాటుగా ఈ కార్యక్రమానికి హాజరైన అతడి ప్రేయసి.. ‘భాగి-2’ కథానాయిక దిశా పఠాని మాత్రం మన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అంటూ సరైన సమాధానం చెప్పడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa