ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆటోలోనే ప్రసవించిన గర్భిణి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 02, 2018, 11:01 AM

రాయ్‌పూర్ : డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఓ నిండు గర్భిణి.. ఆటోలోనే ప్రసవించింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఎదుట చోటు చేసుకుంది. పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిని చికిత్స నిమిత్తం ఆటోలో ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో ఆస్పత్రిలో డాక్టర్లు అందుబాటులో లేరని సిబ్బంది తెలిపింది. దీంతో స్థానికంగా ఉన్న అన్ని ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి. పురిటినొప్పులు అధికమవడంతో ఆ గర్భిణి.. ఆటోలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa