ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏడేళ్ల క్రితం ధోనిసేన సగర్వంగా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 02, 2018, 11:07 AM

సరిగ్గా ఏడేళ్ల కిందట ఇదే రోజున (ఏప్రిల్ 2) టీమిండియా కెప్టెన్‌గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని కొట్టిన సిక్స్‌ను క్రికెట్ అభిమానులు మరిచిపోలేరు. ఎందుకంటే అది భారత జట్టుకు వన్డే ప్రపంచ కప్‌ను అందించిన మధురక్షణం. 2011 ఏప్రిల్ 2న ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు మహేల జయవర్ధనే (103 నాటౌట్: 88 బంతుల్లో 13 ఫోర్లు) అజేయ శతకంతో 50 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసిన విషయం తెలిసిందే. 


275 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో బంతికే డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను మలింగ డకౌట్ చేశాడు. ఆపై సచిన్ టెండూల్కర్‌ (18)ను ఔట్ చేసి మరోసారి దెబ్బకొట్టాడు మలింగ. అయితే వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన గౌతం గంభీర్ (97: 122 బంతుల్లో 9 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నా.. కీలక ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఆదుకున్నాడు. గౌతీ ఔటయ్యాక యువరాజ్ సింగ్ (21 నాటౌట్) సహకారంతో అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోని (91 నాటౌట్: 79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) వీర విహారం చేశాడు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa