హైదరాబాద్: తెలంగాణ జనసమితి పార్టీ పేరును టీజేఏసీ చైర్మన్ కోదండరాం సోమవారం అధికారికంగా ప్రకటించారు. 4న జెండా ఆవిష్కరణ చేస్తామని ఆయన తెలిపారు. 5 నుంచి సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తామని, ఏప్రిల్ 29న హైదరాబాద్‌లో పార్టీ ఆవిర్భావ సభను ఏర్పాటు చేయనున్నట్లు కోదండరాం వెల్లడించారు. చాలా ఆలోచించాకే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు. అమరుల ఆశయాలు నెరవేరలేదన్నారు. మంత్రుల ప్రమేయం లేకుండానే సీఎం శాఖల సమీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎంను కలుసుకోవడానికి ధర్మదర్శనం లేదన్నారు. ఇన్ని రోజులు సచివాలయానికి రాని సీఎం దేశంలో ఎవరూ ఉండరని విమర్శించారు. జనసమితిలో చేరడానికి చాలా మంది ఆసక్తిగా ఉన్నారని ఈ సందర్భంగా కోదండరాం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa