ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పునర్జీవ పథకం కింద 12.45 లక్షల ఎకరాలకు నీరందిస్తాం: హరీశ్‌రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 03, 2018, 12:39 PM

జగిత్యాల: పునర్జీవ పథకం కింద 12.45 లక్షల ఎకరాలకు నీరందిస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జగిత్యాలలో పర్యటిస్తున్న హరీశ్‌రావు రాంపూర్‌లో కాళేశ్వరం రివర్స్‌ పంపు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జులై 31లోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి నీరు నింపుతామన్నారు. ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో రెండు పంటలకు నీరందిస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనుల పరిశీలనకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి రోజు సీసీ కెమెరాల ద్వారా ప్రాజెక్టు పనులను సీఎం పరిశీలిస్తారని పేర్కొన్నారు. కరీంనగర్‌ జిల్లా మానేరు వాగుపై రూ.150 కోట్లతో చెక్‌డ్యాంలు నిర్మిస్తామన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రతిపక్షాల సహకారం లేదు కానీ ప్రజల సహకారం ఉందన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa