ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నిర్వీర్యం చేస్తే ప్రతిఘటన తప్పదని తెలంగాణ లెబర్ పార్టీ అధ్యక్షుడు, బహుజన లెఫ్ట్ ప్రెంట్ కన్వీనర్ గొర్రె రమేష్ అన్నారు. మంగళవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నిర్వీర్యం చేయడానికి అగ్రవర్ణాలు కుట్రలు చేస్తున్నాయన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో బీజేపీ ప్రభుత్వం రివ్యూ పిటీషన్ వేయాలన్నారు. 28 పార్టీల భాగస్వామ్యంతో బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ ఏర్పడిందని, 2019 ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి, ధర్మపురి అసెంబ్లిd స్థానానికి ఫ్రంట్ తరుపున పోటీ చేస్తామని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు మాచెర్ల సత్యనారాయణ, బి.వెంకటేశ్వర్లు, ఎ.తిరుపతి, వేణుమాధవ గుప్త తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa