హైదరాబాద్ : అంబర్‌పేట్ బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ అధికారులపై తేనెటీగలు దాడి చేశాయి. బాగ్‌అంబర్‌పేట్‌లోని వైభవ్‌నగర్‌లోని పార్క్ కమ్యూనిటీ హాల్ అభివృద్ధి పనుల పరిశీలనకు ఎమ్మెల్యేతో పాటు అధికారులు వెళ్లారు. ఈ సమయంలో వారిపై తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల దాడితో అక్కడి నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లిపోయారు. జీహెచ్‌ఎంసీ ఈఈ, డీఎంసీతో పాటు ఇతర అధికారులకు గాయాలయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa