ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోల్‌కతా నైట్‌రైడర్స్ హిట్టర్‌ క్రిస్‌లిన్ ఫిట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 03, 2018, 03:06 PM

భుజం గాయంతో ఇబ్బందిపడుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ విధ్వంసక హిట్టర్ క్రిస్‌లిన్ ఫిటెనెస్ సాధించాడు. శనివారం నుంచి ఐపీఎల్ 2018 సీజన్ ప్రారంభంకానుండగా.. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కోల్‌కతా తన తొలి మ్యాచ్‌లో ఢీకొట్టనుంది. ఇటీవల గాయపడి ప్రాక్టీస్‌కి దూరంగా ఉన్న క్రిస్‌లిన్ మంగళవారం నెట్స్‌లో ఉత్సాహంగా కనిపించాడు. గత ఏడాది సుడిగాలిలాంటి ఇన్నింగ్స్‌లు ఆడి ఒంటిచేత్తో కోల్‌కతా జట్టుని గెలిపించిన క్రిస్‌లిన్‌ను ఈ ఏడాది వేలంలో రూ. 9.6 కోట్లకి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 


క్రిస్‌లిన్‌తో పాటు మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ కూడా నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. ఇటీవల పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో నరైన్ బౌలింగ్‌‌పై మ్యాచ్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నరైన్ ఐపీఎల్‌లో ఎలా బౌలింగ్ చేస్తాడోనని ఆసక్తి నెలకొంది. గత ఏడాది క్రిస్‌లిన్, సునీల్ నరైన్‌లు ఓపెనర్లుగా వచ్చి.. కోల్‌కతాకి మెరుపు ఆరంభాలిచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బెంగళూరుపై నరైన్ ఫాస్టెస్ట్ అర్ధశతకం బాది రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది కూడా ఇద్దరూ ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa