చెన్నై : కావేరి మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు విషయంలో తాత్సారం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ మంగళవారం తమిళనాడులోని తంజావూరు, తిరువరూర్, నాగపట్నం వంటి డెల్టా ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టారు. తంజావూరులో వ్యవసాయ మంత్రి ఆర్. దురైకాను, అన్నాడిఎంకె రాజ్యసభ సభ్యుడు ఆర్. వైశాలలాం, మాజీ మంత్రి వైగై సెల్వన్, ఎమ్మెల్యే సివి. సెకర్, ఎం. గోవిందరాజన్ హెడ్ పోస్టాఫీస్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షను చేపట్టారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం డిఎంకెతో పాటు ఇతర పార్టీల నేతలు తంజావూరులోని ఎల్‌ఐసి డివిజనల్ ఆఫీస్ ఎదుట నినాదాలు చేశారు. కొందరు కార్యకర్తలు సైన్‌బోర్డులపై రాళ్లు రువ్వారు. తంజావూరు, కుంభకోణంలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. కుంభకోణంలోని హెడ్ పోస్టాఫీస్ ఎదుట కావేరి ఫార్మర్స్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొందరు రైతులు ఇసుకను తిని తమ నిరసనను తెలిపారు. అనేక దుకాణాలను మూసివేశారు. రైలు రోకోకు ప్రయత్నించిన ఎనిమిదిమందిని పోలీసులు అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa