హైదరాబాద్: డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా జీవితసాఫల్య పురస్కారాన్ని నేడు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ప్రదానం చేయనున్నారు. రవీంద్రభారతిలో జరుగనున్న ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని హోంమంత్రికి అవార్డును అందజేస్తారు. రామ్‌మనోహర్ లోహియా 108వ జయంతి సందర్భంగా లోహియా విచార్‌మంచ్ ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నది. రిటైర్డ్ చీఫ్ జస్టిస్ సుభాషణ్‌రెడ్డి, ప్రముఖ రచయిత కత్తి పద్మారావు, లోహియా జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ బాలకిషన్‌రావు తదితరులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు కూడా హాజరవుతున్నారని, టీఆర్‌ఎస్ నాయకులు, కార్మికులు, తెలంగాణవాదులు పెద్ద ఎత్తున తరలిరావాలని రాంనగర్ కార్పొరేటర్ వీ శ్రీనివాస్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa