ఢిల్లీ : సభలో ఎవరికి వారు సొంత అజెండాలతో ఆందోళన చేయడం సరికాదని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు అన్నారు. సభలో సభ్యుల ఆందోళనతో గందరగోళ పరిస్థితి ఏర్పడడంతో ఛైర్మన్ వెంకయ్య స్పందిస్తూ అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని చెప్పినా ఆందోళన ఎందుకు? అని ప్రశ్నించారు. ఇలా వ్యవహరించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. సభలో పలు ముఖ్యమైన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. బిల్లులు ఆమోదం పొందేందుకు సభ్యులు సహకరించాలన్నారు. సభా విలువలను కాపాడేలా సభ్యులు వ్యవహరించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa