ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిత్రపక్షాలను కాపాడుకునే దిశగా బిజెపి చర్యలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 04, 2018, 12:31 PM

న్యూఢిల్లి : కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం తన మిత్ర పక్షాలను కాపాడుకోవడానికి చర్యలు చేపట్టింది. తద్వారా నష్ట నివారణ చర్యలు తీసుకోనున్నది. దీనిలో భాగంగా శివసేనకు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పదవి ఇస్తామని ఆశజూపింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ బిజెపికి గుడ్‌బై చెప్పిన విషయం విదితమే. కాగా బిజెపితో ఎప్పటినుంచో బిజెపి మిత్రపక్షంగా గుర్తింపు పొందిన శివసేన కూడా ఇటీవల కాలంలో బిజెపి వ్యవహార శైలిని ఎండగడుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో శివసేన తమను విడిచిపోకుండా ఉండటానికి బిజెపి కసరత్తు ప్రారంభించింది. దీనిలో భాగంగానే శివసేనకు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పదవి ఇస్తామని పేర్కొంది. అయితే దీనిపై శివసేననుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన లేదు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa